చీరలు కోనుగోలు పేరుతో రూ 12 వేలు టోకరా
- నిందితుడి సి సి పుటేజ్ ఫోటోలు విడుదల చేసిన పోలీసులు
ముద్ర ప్రతినిధి జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ కాలనిలోని బట్టల షాప్ లో గుర్తు తెలియని వ్యక్తి రూ. 2200 విలువ గల చీరలు కోనుగోలు చేసి 12,200 టోకరా వేసి పారిపోయాడు. ఆర్ ఎన్ టి నగరులో ఓ మహిళ బట్టల షాపు నిర్వహిస్తుంది. గుర్తు తెలియని ఓ వ్యక్తి నంబర్ లేని బైక్ పై షాపులోకి వచ్చి రూ.2200 విలువ చేసే చీరలు కొనుగోలు చేశాడు. అయితే తన వద్ద నగదు డబ్బులు లేవని ఫోన్ పే చేస్తానని... అలాగే తనకు ఒక రూ. 10 వేలు ఇస్తే అన్ని కలిపి 12,200 చెల్లిస్తా అని పేర్కొన్నాడు. సదరు షాపు నిర్వాహకురాలు మహిళ షాపు లోని ఫోన్ పే స్కానర్ చూపించింది దానికి ఫోన్ పే చేసినట్లు చెసి ఎర్రర్ వస్తుందని మారో మొబైల్ నెంబర్ చెప్పమని దానికి డబ్బులు పంపుతానని ఆ అగంతకుడు తెలిపాడు.
దీంతో సదర్ మహిళ తన భర్త నెంబర్ చెప్పగా ఆ నెంబర్ కు రూ. 12,200 పంపినట్లు తప్పుడు మేసేజి చూపించగా సదరు షాపు యజమాని మహిళ ఆ అగంతకునికి మహిళ రూ. 10 వేలు నగదు ఇచ్చింది. ఆ అగంతకుడు వెళ్లిపోయిన తర్వాత భర్తకు పోను చేసి రూ.12,200 ఫోన్ పే వచ్చాయా అని అడగగా రాలేదని తెలపడంతో డబ్బులు, కాజేసిన నిందితుడిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పట్టణ సి ఐ ఎస్. వేణుగోపాల్ ఘటన స్థలాన్ని పరిశీలించి నిందితుడి సి సి టీవీ పుటేజి పరిశీలించి ఫోటోలను విడుదల చేశారు. ఇలాంటి మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వ్యక్తులు మీ దృష్టికి వస్తె డయలు 100కు సమాచారం ఇవ్వాలని సి ఐ కోరారు. పోలీసుల విడుదల చేసిన సి సి పుటేజీ పరిశీలిస్తే ఆ అగంతకుడు మొదట కిరాణం షాపులో తన పథకం అమలు చేయాలని ప్రయత్నించినట్లు తెలుస్తుంది. అక్కడ విఫలం కావడంతో బట్టల షాపులో మోసపూరితంగా డబ్బులు ఎత్తుకెళ్ళినట్లు తెలుస్తుంది