బాలికపై వ్యక్తి అత్యాచార యత్నం
ముద్ర, బాన్సువాడ: పట్టణంలోని బోర్లం రోడ్డులో ఓ కామాంధుడు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నిస్తుండగా అటుగా వెళ్తున్న యువకులు గమనించి నిలదీశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సోమేశ్వర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిసింది.