రైతు సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు

రైతు సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు
  • రైతు సంక్షేమం కోసమే రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు
  • రైతు సంక్షేమ కమిషన్ నెంబర్ గా రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తా
  • రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్
  • రాష్ట్ర రైతు కమిషన్ గా ఎన్నికైన  చెవిటి వెంకన్న  యాదవ్ ను పెద్ద ఎత్తున సన్మానిస్తున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు


తుంగతుర్తి ముద్ర :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారని అందులో భాగంగానే దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేశారని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ ద్వారా రైతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు.

దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని రైతు సంక్షేమ కమిషన్ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి రైతుల అభివృద్ధి కోసం పాటుపడాలని ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి కట్టుబడి తామంతా రైతు సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు .నూతనంగా ఏర్పాటైన కమిషన్కు పూర్తిస్థాయిలో విధివిధానాలు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పాటు అవుతాయని అన్నారు. గత పాలకుల కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమంపై అధికంగా దృష్టి పెట్టిందని అన్నారు. తనను రైతు సంక్షేమ కమిషన్ మెంబర్గా ఎంపిక చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మిగతా కాంగ్రెస్ పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా రైతు సంక్షేమ కమిషన్ మెంబర్గా ఎంపికైన చెవిటి వెంకన్న యాదవ్ను ఆయన అభిమానులు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గత రెండు మూడు రోజులుగా శాలువాలతో ఘనంగా సన్మానిస్తున్నారు.

తుంగతుర్తి పిఎసిఎస్ కార్యాలయంలో రైతు కమిషన్ చైర్మన్ ఘనంగా సన్మానించిన చైర్మన్ సిబ్బంది

మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయంలో డీసీసీబీ మెంబర్ సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు ఆధ్వర్యంలో రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ మెంబర్లు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ  కార్యాలయంలో జరిగిన జిల్లా భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .ఈ సందర్భంగా ఉపాధి హామీ కార్యాలయ సిబ్బంది చెవిటి వెంకన్న యాదవ్ ఘనంగా సన్మానించారు.