దిశ" రివ్యూ అసంపూర్ణం
- రివ్యూ కు అసంపూర్తి సమాచారంతో అధికారులు
- విషయం లేకపోతె మీటింగ్ ఎందుకన్న ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :సిద్దిపేట జిల్లా కాకలెక్టర్ కార్యా లయం లో బుధవారం జరిగిన దిశ (డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ )రివ్యూ అసంపూర్తి సమాచారం తో ముగిసింది. మెదక్ ఎంపి రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి పై జరిగిన రివ్యూ మీటింగ్ లో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏజెండా కు సంబంధించి ఎంపి అడిగిన సమాచారం జిల్లా అధికారులు ఇవ్వకపోవదడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ మధ్య జిల్లా అధికారులకు బదిలీలు కావడంతో ఆ యా స్థానాలకు కొత్త అధికారులు వచ్చారు.. చాలా మందికి తమ శాఖల పై అవగాహన రాకపోవడంతోసమాచారం ఇవ్వలేదని వివరణలు ఇచ్చారు. దాంతో మరి రివ్యూ మీటింగ్ దేనికి పెట్టినట్టు అని ఒక సందర్బంలో ఎంపి రఘునందన్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. నెక్స్ట్ మీటింగ్ లో పూర్తి సమాచారంతో రావాలని సూచించారు.
పథకాలు లబ్ధిదారులకు అందేలా కృషి చేయండి.....
ప్రజల కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలయ్యే ప్రతి పథకం సకాలంలో లబ్దిదారులకు అందేలా అధికారులు చూడాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక ప్రకారం ప్రజాపయోగార్దం అమలుచేసే ప్రతి పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, అవి అర్హులైన లబ్ధిదారులకుఅందేలా అధికారులు చూడాలని అన్నారు. యం.జి.యన్.ఆర్.ఈ.జి.యస్ పథకం ద్వారా సిద్దిపేట జిల్లాలో 80 నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులు పూర్తవ్వగా, చివరి దశలో ఉన్న నిర్మాణ పనులను సెప్టెంబర్, 19 కల్లా పూర్తి చేసి ప్రారంబోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన ప్రతి చోట ఆపథకం పేరు, నిధులు తదితర వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయించాలన్నారు.
డిఆర్డిఓ ద్వారా కూలీ పనులు చేసే వారితో కేటాయించిన పనులు పూర్తిగా చేయించడంతో పాటు వారికి 300 రూపాయల పూర్తి కూలీని చెల్లించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 12.50 లక్షల మొక్కలను నాటగా అందులో 92 శాతం మొక్కలు బ్రతికాయని, అవసరమైన చోట మరిన్ని మొక్కలు నాటే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలుపగా, గత 10 సంవత్సరాలుగా నాటిన మొక్కల వివరాలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో టిఫిన్ సెంటర్ లు, టీ స్టాల్స్ మొదలైనచోట్ల ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా ఉంటుందని, మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం పైచేపట్టిన వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ చర్యలలో సహకారాన్ని అందిస్తానాని తెలిపారు.
ప్లాస్టిక్ వేస్ట్ మ్యానేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటిలలో ఇప్పటి వరకు సేకరించిన ప్లాస్టిక్వ్యర్థాల వివరాల గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు జిల్లాలోనిప్రతి గ్రామ పంచాయితీలలో ఇంకుడు గుంతల ఏర్పాటు జరిగేలా పంచాయతీ కార్యదర్శుల ద్వారా పర్యవేక్షించాలని అన్నారు. అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని అన్నారు. దుబ్బాక నుంచి దుబాయ్ వంటి ప్రాంతాలకు వలసవెళ్లె వాళ్లు చాలా మంది ఉన్నారని, అలాంటి వారికి స్వయం ఉపాధి కల్పన పథకం ద్వారా భవననిర్మాణ పనులపై శిక్షణను అందించాలన్నారు. ప్రభుత్వపాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్వయం సహాయక సంఘాల ద్వారా స్కూల్ యూనిఫాం కుట్టించేకార్యక్రమం జిల్లాలో విజయవంతం అయిందని అభినందించారు. దాన్యంకొనుగోలు చేసే క్రమంలో తూకం విషయంలో ఇబ్బందులకు తలెత్తకుండా ఐకెపి, స్వయం సహాయక సంఘాలకుస్పష్టమైన అవగాహన కల్పించే శిక్షణ ఇవ్వాలని తెలిపారు.
జిల్లాలోఇప్పటి వరకు 74 శాతం సీఎంఆర్ పూర్తయిందని, సివిల్ సప్లై అధికారులు రైస్ మిల్లుల పై తనిఖీలుచేపట్టి జరిగిన కొనుగోలు ప్రకారం ధాన్యం వివరాలు తెలుసుకోవడం తో పాటు తగిన చర్యలు తీసుకోవాలనిఅన్నారు. జిల్లాలో బీడీ పెన్షన్ కొరకు వచ్చినదరఖాస్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు మంజూరైన కొత్త జాతీయ రహదారి నిర్మాణ పనులలో చివరి దశకు చేరుకున్న రోడ్ల వద్ద మల్టీ లేయర్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని. జిల్లాలోఇప్పటి వరకు కేటాయించిన రెండు పడక గదులు అర్హులకు అందాయా సమీక్షించి అర్హులకు పట్టాలనుఅందించే పనులు చేపట్టాలన్నారు.
నిర్మాణాలుపూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న వాటిని 30 రోజుల్లో అసలైన లబ్దిదారులకు అందించాలని సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ ద్వారా వికలాంగులకు అందించేఉపకరణాలను ఇకపై ఏడాదికోసారి అందించేలా చూడాలన్నారు. రాజీవ్ఆరోగ్య శ్రీ వైద్య సేవలు రోగులకు అందించడంలో ప్రైవేటు ఆసుపత్రులు ఇబ్బందులకు గురి చేయకుండాచూడాలని, టి డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని, ఆసుపత్రులలో అధికారులు తనిఖీలు చేపట్టాలన్నారు. జిల్లాలోడెంగ్యూ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని, అన్ని ఆరోగ్య కేంద్రాల్లోఅవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో రెండు కొత్తగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మద్యాహ్న భోజనం తోపాటు పిల్లలకు డి వార్మింగ్ కార్యక్రమంలో మందులు అందించే కార్యక్రమం సక్రమంగా జరిగేలాచూడాలన్నారు.
చేనేత కార్మికుల జీవితాలు ఆర్థికంగా చితికాయని, నూలు వడికే నేత కార్మికులకు సకాలంలో ప్రభుత్వం అందించే లబ్దిని త్వరగా అందించేలా చూడాలని, జిల్లాలో అవకాడో, డ్రాగన్ ఫ్రూట్ సాగు పై రైతులకు అవగాహనను కల్పించి లాభదాయకమైన సాగు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న భవనాలను త్వరగా ప్రారంభించేలా చూడాలన్నారు. అన్ని మున్సిపాలిటీలలో పబ్లిక్ టాయిలెట్ లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. యం.ఎల్.సి యాదవ్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వైర్ల కింద పెద్దగా పెరిగే మొక్కలు కాకుండా తక్కువ ఎత్తులో పెరిగే మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలని, కోతులు ఊర్లలోకి రాకుండా అడవుల్లో పండ్ల మొక్కలను పెంచాలని అన్నారు. సదరం క్యాంప్ నిర్వహణ గురించి సమాచారం ప్రజలకు చేరేలా టాంటాం నిర్వహించాలని, అసంపూర్తిగా ఉన్న 2 బిహెచ్కే నిర్మాణ పనులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అభివృద్ధి మీటింగ్ లో మైనారిటీ శాఖకు స్థానం లేదా...?
బుధవారం జరిగిన దిశ రివ్యూ మీటింగ్ లో ఏజెండా లో ఉన్న దాదాపు అన్ని శాఖల పై చేసిన ఎంపీ,అధికారులు మైనారిటీ శాఖను మరిచిపోవడం కొంత విస్మయానికి గురి చేసింది. అసలు మైనార్టీ శాఖ జిల్లా లో ఉందా ఉంటే మైనారిటీ లకు ఉపోయోగం ఉందా అన్న ప్రశ్న త లెతుతుంది. ఒక వేల ఎంపి ఈ విషయం మరిచిపోయిన అక్కడే ఉన్న అధికారులు కూడా గుర్తుచేయకపోవడం ఏంటన్న విషయం అంతు చిక్కదం లేదని పలువురు వాపోయారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనుచౌదరి, స్దానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గోన్నారు.