రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం..కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం..కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి

ముద్ర,తెలంగాణ:- రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో బుధవారం రాత్రి పిట్ల రాజలక్ష్మి (75) అనే వృద్ధురాలు వీధికుక్కల దాడిలో మృతి చెందింది. కుక్కలు ఆమె శరీర భాగాలను తిన్నట్లు గుర్తించారు. గ్రామస్తులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. తలుపులు లేని ఇంట్లో రాజలక్ష్మి ఒంటరిగా నివసిస్తోంది. ఆమె నిద్రిస్తున్న సమయంలో కుక్కలు ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాయి.

గురువారం ఉదయం కుమారులు ఇంటికి చేరుకుని చూడగా ఆమె తల, పొత్తికడుపును కుక్కలు తిన్నాయి. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు చిన్నారులపై కుక్కలు దాడి చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో ఇప్పుడు రాజలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. అధికారులు వెంటనే కుక్కలను గ్రామం నుంచి తరలించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.