ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
రెండు వాహనాలు ఢీకొని ఐదురుగు దుర్మరణం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తుక్కుగూడ వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న రెండు కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొని ఐదుగురు మృతిచెందారు. ముందు వెళ్తున తుపాన్ వాహనాన్ని వెనక నుంచి బొలెరో ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా తుపాన్ వాహనంలో ప్రయాణిస్తున్న వారే. వీరిని వనపర్తి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. యాదాద్రి దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అయితే బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా యువకులు కాగా వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంలో తుపాన్ డ్రైవర్ తాజ్, వరాలు, దీక్షిత(13) మరో రెండు నెలల చిన్నారి మృతిచెందారు. బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఔటర్ రింగు రోడ్డుపై తుఫాన్ వాహనాన్ని అతివేగంతో వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన 14 మందిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వివరాలు, మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.