భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్నది. బుధవారం ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 42.2 అడుగులుగా ఉండగా.. గురువారం ఉదయం 8 గంటలకు గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరుకుందని CWC అధికారులు తెలిపారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతున్నట్లు తెలిపారు. అటు భద్రాచలం వద్ద ఔట్ ఫ్లో 9,74,666 క్యూసెక్కులుగా ఉందన్నారు. కాగా ఇప్పటికే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.