ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తా- ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. సోమవారం పట్టణం లో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన గందే సురేష్ ను సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు. సమస్యలను పరిష్కరించేందుకు సంఘటితంగా ముందుకు సాగాలని కోరారు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గందే సురేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేలు కోరారు ఆర్యవైశ్యులు కుల మతాల కచ్చితంగా అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అంగనూరి విశ్వం, ఆర్యవైశ్య సంఘం నాయకులు పలపట్ల మోహన్ రావు గజవాడ వెంకటేష్ బెజగం రమేష్ లష్కర్ కుమార్ పెద్ది రామ్మోహన్ ఎం సానిశ్రీనివాస్ మలిపెద్ది శ్రీనివాస్ వైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు..