హాస్టల్ నుండి విద్యార్థుల మిస్సింగ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం నుండి నలుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. హాస్టల్లో ఉంటున్న చరణ్, రాకేష్, కేశవ్, ఈశ్వర్ లు మంగళవారం ఉదయం నుండి హాస్టల్లో కనిపించకుండా పోయారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ చేరుకుని తమ పిల్లలు ఎక్కడికి వెళ్లారు సిబ్బందిని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా సోమవారం రాత్రి విద్యార్థుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఎప్పటి లాగే మంగళవారం తెల్లవారుజామున వాచ్ మెన్ పాలను అందించేందుకు వెళ్ళిన సమయంలో విద్యార్థుల మిస్సింగ్ విషయాన్ని గమనించాడు. ఈ విషయం బయటకు రావడంతో సీఐ గోపీనాథ్ హాస్టల్ కు చేరుకొని విద్యార్థుల వివరాలను సేకరించడం ప్రారంభించారు. అలాగే హాస్టల్ సిబ్బంది విద్యార్థులను వెతికే పనిలో పడ్డారు.