సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ డాక్టర్ కేతూరి వెంకటేష్...
ముద్ర,పానుగల్ :-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్, కేతేపల్లి గ్రామ వాసి డాక్టర్ కేతూరి వెంకటేష్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు.గడచిన 23 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని,విద్యార్థి దశ నుండి ఎన్ ఎస్ యు ఐ 2001 నుంచి ఉస్మానియా క్యాంపస్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అహర్నిశలు శ్రమిస్తూ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని వున్నట్లు ఆయన తెలిపారు.
భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తిచేసిన "భారత్ జోడో " యాత్రలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 150 రోజులు 4080 కిలో మీటర్లు రాహుల్ గాంధీ గారి వెంట అడుగులు వేస్తూ నా వంతు పాత్ర పోషించడం జరిగిందనీ,అట్టడగు వర్గాల స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీ లో బలోపేతం కోసం క్రియాశీలక పాత్ర పోషిస్తూ। తెలంగాణ ఉద్యమం మెదలుకొని ఎన్నో పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొనీ అలుపెరుగని పోరాట నాయకుడుగా నా బాధ్యత నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు ప్రజా ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు.