జాతీయ స్థాయిలో సత్తా చాటిన హైదరాబాద్లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్

జాతీయ స్థాయిలో సత్తా చాటిన హైదరాబాద్లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్

హైదరాబాద్‌ షహర్.. ఇరానీ చాయ్‌కి, ధమ్ బిర్యానీకి ఎంత ఫేమస్సో.. షాపింగ్‌కు కూడా అంతే ఫేమస్. అది స్ట్రీట్ షాపింగ్ అయినా.. పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉన్న షాపింగ్ మాల్స్‌లో అయినా. ఇది ఊరికే చెప్తున్న ముచ్చట కాదు.. హైదరాబాద్ వాసుల షాపింగ్ సత్తా చూసి.. ఓ నివేదిక ఇచ్చిన రిపోర్ట్. హైదరాబాద్ జనాలు చేస్తున్న షాపింగ్‌ దెబ్బకు.. నగరంలోని ఓ షాపింగ్ మాల్.. జాతీయ స్థాయిలో నిలిచింది. భారత దేశంలో.. ప్రతి రోజూ అత్యధిక కస్టమర్లు సందర్శించే టాప్ 25 షాపింగ్ మాల్స్ జాబితాను.. జియోఐక్యూ అనే జియోలొకేషన్ స్టార్టప్ విడుదల చేసింది. కాగా.. ఈ లిస్టులో.. మన హైదరాబాద్‌కు చెందిన రెండు షాపింగ్ మాల్స్ సత్తా చాటాయి. అందులో ఒకటి శరత్ సిటీ క్యాపిటల్ మాల్ అయితే.. మరొకటి నెక్సస్ మాల్.

శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌.. ప్రతి రోజు సగటున 19 వేల105 మంది కస్టమర్లకు ఆకర్షిస్తూ తొమ్మిదో స్థానంలో నిలిచింది. కాగా.. నెక్సస్ మాల్ సగటున 14 వేల 493 రోజువారీ సందర్శకులతో 25వ స్థానంలో ఉంది. అయితే.. భారతదేశంలో అత్యధిక కస్టమర్లు సందర్శించే షాపింగ్ మాల్స్ లిస్ట్‌లో ఢిల్లీ, ముంబైలోని షాపింగ్ మాల్స్ టాప్‌లో ఉన్నాయి.