'టీటీడీలో పని చేసే అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతం..
- టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య చౌదరి
తిరుపతి, ముద్ర ప్రతినిధి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవో నియమితులైన వెంకయ్య చౌదరి శనివారంనాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ లో పనిచేసే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతమని అన్నారు.
తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని,సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తామని వెంకయ్య చౌదరి తెలిపారు.ఉద్యోగులందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు.