చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం

చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం

చైనాలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.5గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. జిజాంగ్‌లో ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో భూకంపం సంభవించింది. వెడల్పు : 29.76, పొడుగు : 92.17, 110 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని ఎన్‌సిఎస్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ పోస్టులో పేర్కొంది.