ఏపీలో 'ఉచిత గ్యాస్‌' బుకింగ్స్‌ ప్రారంభం

ఏపీలో 'ఉచిత గ్యాస్‌' బుకింగ్స్‌ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం ఉచిత సిలిండర్ పథకానికి శ్రీకారం చుట్టింది. దీపావళి పండుగ రోజున ఫ్రీ సిలిండర్లను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పథకం కింద, అక్టోబర్ 31 నుంచి మార్చి వరకు ఒక సిలిండర్, ఏప్రిల్ 1, 2025 నుంచి జూలై వరకు రెండోది, జూలై 1 నుంచి నవంబర్ వరకు మూడో సిలిండర్ ఉచితంగా ఇవ్వనున్నారు.

వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేస్తే, డెలివరీ దీపావళి రోజున జరగనుంది. సిలిండర్‌ కోసం ముందుగా రూ.811 చెల్లించాల్సి ఉంటుంది, అయితే, చెల్లించిన డబ్బు రెండు రోజుల్లో వినియోగదారుల బ్యాంక్ అకౌంట్లలో తిరిగి జమ అవుతుంది. తెల్ల రేషన్ కార్డులున్న వారు ఈ పథకానికి అర్హులు. బుకింగ్‌లో ఇబ్బందులు ఎదురైతే, టోల్ ఫ్రీ నెంబర్ 1967కు సంప్రదించాలని అధికారులు సూచించారు.