మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..గర్భిణీతో సహా శిశువు మృతి
ముద్ర,తెలంగాణ:- మెదక్ జిల్లా మనోహరాబాద్‌లోని 44వ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడునెలల గర్భిణీతో పాటు ఆమె కడుపులో ఉన్న శిశువు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మిర్దొడ్డి మండలానికి చెందిన దంపతులు మనోహరాబాద్ నుంచి దండుపల్లికి బైక్‌పై వెళ్తున్నారు.
నేషలనల్ హైవేను క్రాస్ చేస్తుండగా తుప్రాన్ వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ.. బైక్‌ను ఢీకొట్టిది. దీంతో దంపతులిద్దరూ కిందపడిపోయారు. మహిళతో పాటు ఆమె గర్భంలో ఉన్న ఏడు నెలల శిశువు అక్కడిక్కడే మృతి చెందారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మృతురాలి భర్తకు తీవ్రంగా గాయాలవ్వడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గర్భిణితో సహా శిశువు మృతి చెందడంతో మనోహరాబాద్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.