తాళం వేసిన ఇంట్లో చోరీ..

తాళం వేసిన ఇంట్లో చోరీ..

ముద్ర, మల్యాల : తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసిన సంఘటన శనివారం రాత్రి మల్యాలలో చోటు చేసుకుంది. పుప్పాల దేవయ్య అనారోగ్య కారణం తో ఇంటికి తాళం వేసి 15 రోజులుగా బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో  చొరబడి బీరువా పగలగొట్టి తులం బంగారం, రూ" 44,600/- నగదు దొంగలించినట్లుగా దేవయ్య తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. సిఐ నీలం రవి, ఎస్ఐ నరేష్ పరిశీలించి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ల ద్వారా వేలిముద్రలు సేకరించారు.