తుంగతుర్తిలో గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరవేయాలి

తుంగతుర్తిలో గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరవేయాలి

ముద్ర తిరుమలగిరి: త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తుంగతుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ను ఎగురవేయడానికి పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని  ఎల్ డి ఎం ఆర్  నియోజకవర్గ ఇన్చార్జి బాలా లక్ష్మి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ కోరారు. శనివారం నాడు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని వంగపల్లి నరసయ్య ఫంక్షన్ హాల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు ప్రసంగించారు. రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తుంగతుర్తి నియోజకవర్గం లో జరుగుతున్న అఖిలపక్ష కమిటీ నాయకులపై జరుగుతున్న దాడులపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు అలాగే అన్ని మండల అనుబంధ సంఘాల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని వారు అన్నారు. 

యువత రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ను విజయవంతం చేయాలని రాష్ట్రంలోనే తుంగతుర్తి నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలపాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పిసిసి ఎస్సి సెల్ అధ్యక్షులు నాగరగాని ప్రితం  తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గుడిపాటి నరసయ్య తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు ఏల్సోజు నరేష్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్  మైనార్టీ సెల్ నాయకులు ఎం డి హాఫిజ్ . రామోజీ ప్రేమ్ సింగ్ పేరాల వీరేష్  జిమ్మి లాల్ తదితరులు పాల్గొన్నారు.