మేడారం జాతరకు వెళ్తోన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ...
ముద్ర,జయశంకర్ భూపాలపల్లి:- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిపల్లి అటవీ ప్రాంతంలో మేడారం వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌తోపాటు బస్సులోని పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
బస్సు మంచిర్యాల డిపో నుంచి మేడారం వైపు వెళ్తుండగా కాటారం - భూపాలపల్లి ప్రధాన రహదారిపై మేడిపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో మెుత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోటవంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.