KCR Bus Yatra - ఈ రోజు వరంగల్ జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర

KCR Bus Yatra - ఈ రోజు వరంగల్ జిల్లాలో కేసీఆర్ బస్సు యాత్ర

ముద్ర,తెలంగాణ:- నేడు వరంగల్ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ లోక్ సభ అభ్యర్థి సుధీర్ కుమార్ తరపున హనుమకొండ లో రోడ్ షో నిర్వహించనున్నారు.ఆదివారం సాయంత్రం నగరానికి చేరుకుని నేరుగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం జిల్లా నేతలతో కలిసి బస్సులో అదాలత్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, పెట్రోల్ పంపు జంక్షన్ మీదుగా హనుమకొండ చౌరస్తాకు చేరుకుంటారు. చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారు.