రంజిత్‌రెడ్డిని గెలిపించుకుంటాం
- చేవెళ్ల కాంగ్రెస్ లీడర్లు
- పార్టీలో చేరిన బీఆర్ఎస్, బీజేపీ సీనియర్‌నేతలు
- కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో, శంకర్ పల్లి: చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పష్టం చేశారు. గురువారం చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి ఆధ్వర్వంలో బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేతలు హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారందరికీ రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు.
ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం..
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేసి తీరుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, దొరల ప్రభుత్వం పోయి ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని గుర్తు చేశారు. తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీలో చేరినవారిలో చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శంకర్ పల్లి జడ్పీటీసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి, శంకర్ పల్లి మునిసిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కౌన్సిలర్లు లక్ష్మమ్మ, శ్వేత, చంద్రమౌళి, అశోక్, శ్రీనాథ్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు రజని శ్రీనివాస్, మహమూద్, నాయకులు బాలకృష్ణ రెడ్డి, రాజేశ్వర్ గౌడ్, రఘునందన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి ఉన్నారు. అలాగే మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ మాజీ జడ్పీటీసీ జిల్లెల నరేందర్ రెడ్డి, కందుకూరు జేడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సిద్దాల దశరథ, రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు బచ్చనబోయిన నరసింహ యాదవ్, కార్పొరేటర్ బచ్చన బోయిన పద్మ, రంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, అనిత నాయక్, తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవానీ వెంకట్ రెడ్డి, జల్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఇక్బాల్ బిన్ ఖలీఫా, జల్పల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ యూసుఫ్ పటేల్, కౌన్సిలర్ తేజిస్వీని శ్రీకాంత్, కొండల్ యాదవ్, కౌన్సిలర్ అవల్గీ, మీర్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాజీ జడ్పీటీసీ జిల్లెల్ల నరేందర్ రెడ్డి, జిల్లాలగూడ మాజీ సర్పంచ్ జిల్లెల్ల వనిత, మాజీ ఎంపీటీసీలు చల్వది రాజేశ్, యాదయ్య, బొబ్బిలి కిరణ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొబ్బిలి విజయ్ గౌడ్, భీమ్ రాజ్ శంకర్, శ్రీ కాంత్, బద్దం అనిల్ గౌడ్, గ్యార అనిల్ కుమార్, తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.