Murder - గచ్చిబౌలిలో దారుణ హత్య ...

ముద్ర,హైదరాబాద్:- గచ్చిబౌలిలో దారుణ హత్య చోటుచేసుకుంది. గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో హోటల్ యజమాని శ్రీనివాస్ (54) తలపై ఇనుప రాడ్‌తో దుండగుడు ఒక్కసారిగా దాడి చేయడంతో మృతిచెందాడు. ఈ వీడియోలో హోటల్ రిసెప్షన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుర్చీపై కూర్చిండి వుండిన హోటల్ యజమానిపై వెలుపల నుంచి గునపంతో వచ్చిన వ్యక్తి దాడి చేశాడు. రెండు దెబ్బలకే యజమాని ప్రాణాలు కోల్పోయాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని ఆ హోటల్‌లోని వ్యక్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి వుంటుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.