DK Aruna - మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డీకే అరుణ...
ముద్ర,తెలంగాణ:- నరేంద్ర మోడీ మూడోసారి దేశ ప్రధానిగా కావాలని ప్రజలందరూ ఓ నిర్ణయానికి వచ్చారని, దేశంలో అత్యధిక సీట్లతో మోడీ మరోసారి అధికారం చేపట్టబోతున్నారని మహబూబ్ నగర్ లోకసభ అభ్యర్థి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లోకసభ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏబీఎన్ రెడ్డి పాల్గొన్నారు.
డీకే అరుణ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లా నిరాదరణకు గురైందని, ఇప్పుడు జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ అభివృద్ధితోపాటు పాలమూరు జిల్లా అభివృద్ధికి దోహదపడే ఎన్నికలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.