బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు
గుండాల సెప్టెంబర్ 04, (ముద్ర న్యూస్): గుండాల మండల కేంద్రంలోని వేల్మజాల గ్రామానికి చెందిన పలువురు నాయకులు వివిధ పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి డిసిసిబి చైర్మన్ టేస్ క్యాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా,ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి పథకాలకు ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలకీ చేరుతున్నారనీ,రానున్న ఎన్నికల్లో హైట్రిక్ విజయం సాధిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో,మాజీ ఎంపీపీ సంఘీ వేణుగోపాల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాస సుబ్రహ్మణ్యం సంఘీ బాలక్రిష్ణ నాగరాజు పాండు దయాకర్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.