గ్యారెంటీల అమలు పక్కా - సింగపురం ఇందిర
ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని టి పి సి సి ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జ్ సింగపురం ఇందిర అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం రాఘవాపూర్, మీదికొండ గ్రామాలలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా దరఖాస్తు దారులను ఉద్దేశించి మాట్లాడుతూ 6 గ్యారెంటీలలో బస్సు ప్రయాణం మహిళలు వినియోగించుకుంటున్నారని మిగిలిన ఐదు పథకాల అమలుకు ఈ దరఖాస్తులు ప్రామాణికమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. ఆమె వెంట జడ్పిటిసి మారుపాక రవి, నాయకులు కాసాని బొందయ్య, నాగరబోయిన శ్రీరాములు, ఏదునూరి రవి, గంగుల మహేష్ రెడ్డి, వంగ రాజు, వడ్లకొండ రవి, పెద్ద సమ్మయ్య, నర్సింలు, పవన్, ఆర్ రవి, జి వెంకటయ్య, జోగు బాబు, రాంచందర్, రాకేష్, ప్రశాంత్, మాజీ జెడ్పిటిసి గుర్రం యాదగిరి, పట్టణ అధ్యక్షుడు నీల శ్రీధర్, మహిళ మండల అధ్యక్షురాలు ఝాన్సీ, పద్మ, ఎస్. నాగయ్య, ఎస్.వెంకటయ్య, ఎస్.రాజు