ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఆర్యవైశ్యులు అండగా నిలవాలి    

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఆర్యవైశ్యులు అండగా నిలవాలి    
  • ఆర్యవైశ్యుల సమ్మేళనంలో కాంగ్రెస్ నేతలు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా:  రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీకి ఆర్యవైశ్యులు అండగా నిలవాలని ఎల్లవేళలా వారికి అండదండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లురవి అన్నారు జిల్లా కేంద్రంలోని ఒక బంకిట్ హాలులో ఏర్పాటుచేసిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తూ అందరికీ మాట్లాడే స్వేచ్ఛ జీవించే హక్కుతో పాటు వ్యాపార హక్కులు కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆర్యవైశ్యులు అండగా నిలవాలని రాబోయే ఐదు సంవత్సరాలలో వారిపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

గత శాసనసభ ఎన్నికలలో ఆర్యవైశ్యులు అండగా నిలవడం వల్లే డాక్టర్ రాజేష్ రెడ్డి విజయం సాధించారని అదేవిధంగా మల్లురవి విజయానికి కూడా ఆర్య వైశ్యులు ముందుకు రావాలని కోరారు. డాక్టర్ మల్లు రవి ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొంది రాజకీయాలలో 30 సంవత్సరాలకు పైగా కొనసాగుతూ సేవలు అందిస్తున్నారని  అయోధ్య రామ మందిరం అందరికీ ఆదర్శమేనని దానిని సాకుగా చూపి రాజకీయ లబ్ధి పొందేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని దాన్ని తిప్పి కొట్టాలన్నారు రాజకీయాలలో కుల మతాల వల్ల అభివృద్ధి జరగదని విద్వేషాలు వస్తాయని అన్నారు. ప్రజాస్వామ్యం కూడా కావాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు రాష్ట్రంలో బిజెపి ప్రభావం లేదని బిఆర్ఎస్ కూడా కుటుంబానికి పరిమితం అవుతుందని అన్నారు ఈ సమావేశంలో వందలాది మంది ఆర్యవైశ్యులు పాల్గొన్నారు