కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి దగ్గర కొనసాగుతున్న వైసీపీ కార్యకర్తల ఆందోళనలు. పులివెందుల నుంచి 100 వాహనాల్లో భారీగా తరలివచ్చిన జనం. ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కడప నుంచి కర్నూలుకు పోలీసు బలగాలు వచ్చాయి. ఐదుగురు ఐఏఎస్‌లు, ముగ్గురు సీఐలు, 20 మంది కానిస్టేబుళ్లు కర్నూలుకు వచ్చారు. సీబీఐ అధికారులు పోలీసు గెస్ట్‌హౌస్‌లోనే ఉన్నారు. వారు సుప్రీం కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.