విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
ముద్ర/వీపనగండ్ల: కౌలు తీసుకున్న మామిడి తోట వద్ద విద్యుత్ బల్బును ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంకాలం మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు పోలీసుల కథను ప్రకారం వీపనగండ్ల గ్రామానికి చెందిన తెలుగు చెన్నమౌని శేషమ్మ బాలయ్య ల కుమారుడు చెన్నమౌని రవి (21) మండల పరిధిలోని గోవర్ధనగిరి సమీపంలో మహానంది రెడ్డికి చెందిన మామిడి తోటను కౌలుకు తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
తండ్రి కొడుకులు ఇరువురు కలిసి మామిడి తోటకు మందును పిచికారి చేసిన తర్వాత, మామిడి తోటలో విద్యుత్ బల్బును ఏర్పాటు చేసుకోవడానికి చెన్నమౌని రవి మామిడి చెట్టు ని ఎక్కి 11 కెవి విద్యుత్ వైర్లకు విద్యుత్ తీగలు తగిలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి చెట్టు కొమ్మల మధ్యనే పడి చెట్టుమీదనే మృత్యువాత పడినట్లు తెలిపారు. ఘటన స్థలాన్ని ఎస్సై రవి ప్రకాష్ పరిశీలించారు.