మందమర్రి కేసులో "నలుగురు నిందితుల అరెస్టు" 

మందమర్రి కేసులో "నలుగురు నిందితుల అరెస్టు" 

రామకృష్ణాపూర్,ముద్ర : మేకలు దొంగతనం చేశారనే కారణంతో  కిరణ్ ను తలకిందులుగా వేలాడదీసి కింద మంట పెట్టీ రాములు,శ్రీనివాస్,స్వరూప,నరేష్ హింసించారని మందమర్రి యాపల్ ప్రాంతానికి చెందిన నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని బెల్లంపల్లి ఎసిపి సదయ్య, మందమర్రి ఎస్సై చంద్రకుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. ఈ మేరకు క్రైమ్ నెంబర్ 165/23 అండర్ సెక్షన్ 342,307 అర్/డబ్ల్యు 34 ఐపిసి & సెక్షన్3(2)(v) ఎస్సీ/ఎస్టీ పిఓఏ యాక్ట్ 1989 చట్టం ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ రిమాండ్ కొరకై రాములు,శ్రీనివాస్, స్వరూప లను అదిలాబాద్ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన మరో నిందితున్ని ఆదివారం అదుపులోకి  తీసుకున్నారు. మందమర్రి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి ఏసిపి సదయ్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 24 గంటల్లోనే కేసును చేదించి నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసులను సిపి రాజేశ్వరి అభినందించారు.

ప్రతి నెల "సివిల్ రైట్స్ డే" నిర్వహించాలి 
 
రామగుండం పోలీస్ కమిషనర్ రేమ రాజేశ్వరి ఐపీఎస్ ఆదేశాల మేరకు దళితులపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో ప్రతినెల 30వ తేదీన ప్రతి పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎసిపి సదయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు కుల వివక్ష చట్టాలపై అవగాహన కల్పించాలని, హక్కులకు భంగం కలిగించడం, కుల వివక్ష చూపడం, దాడులకు పాల్పడడం చట్టరీత్య నేరమని ఎవరైనా పాల్పడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.