ప్రభుత్వం మోసం చేస్తున్నందునే ఉద్యమ కార్యాచరణ: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ప్రభుత్వం మోసం చేస్తున్నందునే ఉద్యమ కార్యాచరణ: బొప్పరాజు వెంకటేశ్వర్లు

సీపీఎస్‌పై ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఏపీ అమరావతి ఐకాస ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో బొప్పరాజు ఉద్యోగులతో సమావేశమయ్యారు. వచ్చేనెల 5 నుంచి చేపట్టబోయే ఉద్యమ వివరాలను ఉద్యోగులకు వివరించారు. చట్టపరంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులనే అడుగుతున్నామని బొప్పరాజు చెప్పారు.

ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. పీఆర్‌సీ నుంచి డీఏ వేరు చేసి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగికి ఏటా రావాల్సిన డీఏను పీఆర్సీతో కలిపి ఇస్తామనడం తమను మోసం చేయడమేనన్నారు. ప్రభుత్వం తమను అన్నిరకాలుగా మోసం చేస్తున్నందునే వచ్చే నెల 5 నుంచి అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి ఉద్యమ కార్యాచరణ వెల్లడిస్తామని తెలిపారు.