రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి...

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి...

ముద్ర, గంభీరావుపేట : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన గంభీరావుపేట మండలం లక్ష్మి పూర్ తండా లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  లక్ష్మీపూర్ తండాకు చెందిన ధరావత్ నవీన్ (23) మంగళవారం రాత్రి ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి నుండి లక్ష్మీపూర్ తండాకు వస్తున్న సమయంలో లక్ష్మీపూర్ తండా లో నవీన్ బైకును కుక్కలు వెంబడించగా, బైకు అదుపుతప్పి రోడ్డు కు అవతలవైపు  ఉన్న జీపీ వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టాడు. దింతో తీవ్రంగా గాయపడిన నవీన్ ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు తెలిపారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.