మీ  బిడ్డ వస్తున్నాడు ఆశీర్వదించండి..

మీ  బిడ్డ వస్తున్నాడు ఆశీర్వదించండి..
  • ఏఐసీసీ సెక్రటరీ క్రిస్టోఫర్ తిలక్..
  • రుద్రoగి మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం..

ముద్ర,రుద్రoగి:రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశనికి ఏఐసీసీ సెక్రటరీ క్రిస్టోఫర్ తిలక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో మొన్న నిర్వహించిన ఒక  సర్వే ప్రకారం రాష్ట్రంలో 65 నుండి 70 సీట్లులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని మనకు ఒక స్పష్టం అయిన మెజారిటీతో డిసెంబర్ లో అధికారం చేపడుతున్నమని అన్నారు...నీళ్లు,నిధులు,నియమాకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పరుతుందన్నారు..కేవలం రా జకీయల కోసమే హుజురాబాద్ ఎలక్షన్ సమయంలో కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని.హుజురాబాద్ ఎన్నికలు అయిపోయిన వెంటనే దళిత బంధు పథకం అటకెక్కిందన్నారు..దేశంలో ఎక్కవగా మద్యం తాగుతున్న రాష్ట్రంగా తెలంగాణ ను మొదటి స్థానంలో నిలిపిన ఘనత కేవలం కేసీఆర్ కె దక్కుతుందని అన్నారు...బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే నిర్మాణలు చేపడుతోందని,భారతదేశంలో దాదాపు 65 శాతంగా ఉన్న యువ శక్తి కి సరైన అవకాశం లేక తప్పు త్రోవ పడుతున్నారని అన్నారు...వేములవాడ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా దొరల పాలన నడుస్తోందని,మొన్నటి వరకు జర్మన్ దొర వేములవాడను పాలించాడు.నేడు మళ్ళీ కరీంనగర్ నుండి ఇంకొక దొర వేములవాడ కోసం వస్తున్నాడు,వేములవాడని ఇలాగే దొరల పాలనే ఉంచుదామ అని అన్నారు..ఒక బీసీ బిడ్డ మన కోసం వస్తున్నాడు..కావున ప్రతీ ఒక్కరు బీసీ బిడ్డని ఆశీర్వదించి వేములవాడ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు..

వేములవాడలో ఒక బీసీ బిడ్డకు ఒక వెలమ దొరకు మధ్య కొనసాగుతున్న ఎన్నిక అని,అది శ్రీనివాస్ మీ సమస్యల తెలిసిన వ్యక్తిగా మీ ఇంటి బిడ్డగా వస్తున్నాడని అన్నారు.వేములవాడ ప్రాంతం పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కేవలం అది శ్రీనివాస్ మాత్రమే.కేవలం ఓట్ల కోసమే ఈ ప్రాంతం పైన ఏ మాత్రం అవగాహన లేని ఒక కరీంనగర్ దొర అధికారం కోసం వస్తున్నాడని అన్నారు..కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు కేవలం 2018 ఎన్నికల్లో ఓట్ల కోసమే పనులు ప్రారంభించారని,కానీ నేడు చేస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది..రుద్రoగి బిడ్డగా మీ సంపూర్ణ మద్దతు అది శ్రీనివాస్ కు ఉండాలన్నారు..రానున్న ఎన్నికల్లో బారి మెజారిటీతో అది శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు..ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు,వేములవాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అది శ్రీనివాస్,డీసీసీ కార్యదర్శి చెలకల తిరుపతి,మండల అధ్యక్షుడు తూము జలపతి,ఉప అధ్యక్షుడు తర్రె మనోహర్,గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి,బీసీ సెల్ అధ్యక్షుడు గండి నారాయణ,నాయకులు గడ్డం శ్రీనివాస్,కట్కూరి దాసు,తర్రె లింగం,ఇప్ప మహేష్,ఎర్రం గంగానర్సయ్య,పరందములు,మహిపల్,మనోజ్ , కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.