ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నిరసనలు

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నిరసనలు

ముద్ర,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు.పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడం, దగా చేయడమేనని కేసీఆర్ దుయ్యబట్టారు.