ఉపాధి హామీ పథకంకు ఉరేసిన కేంద్ర బడ్జెట్

ఉపాధి హామీ పథకంకు ఉరేసిన కేంద్ర బడ్జెట్
Central Budget allocated to Employment Guarantee Scheme

కొండమడుగు నర్సింహ జిల్లా ప్రధాన కార్యదర్శి 

భువనగిరి (ముద్ర న్యూస్): ఆర్భాటంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ ఆహార సబ్సిడీ రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీల పైన భారీ ఎత్తున కోత విధించడం గ్రామీణ ప్రాంత పేదల నోట్లో మట్టి కొట్టిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీకి గత బడ్జెట్లో 89 వేల కోట్ల రూపాయలను కేటాయించిన మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో 60 వేలకోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది 40% పైగా నిధులను తగ్గించడం అంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా పనిని కల్పించే  బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడడం దేశంలో 15 కోట్ల కుటుంబాలను ఉపాధికి దూరం చేయడమే అవుతుందని అన్నారు.

మన రాష్ట్రంలో 55 లక్షల జాబ్ కార్డులు కలిగిన కుటుంబాల పనిమీద తీవ్రమైన ప్రభావం పడనున్నది గ్రామీణ ప్రాంత పేదలకు ఆహార భద్రతను కల్పించడం కోసం గత సంవత్సరం 2, 87, 194  కోట్లను బడ్జెట్లో కేటాయించిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో 1, 97,350 కోట్లకు తగ్గించింది అంటే సబ్సిడీ బియ్యం గోధుమలు పిండి పామాయిల్ వంటివి అందించే బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకో చూస్తున్నట్లు కనిపిస్తున్నదని అన్నారు.

రైతులకు అందించే ఇన్పుట్ సబ్సిడీ రెండు లక్షల 25 వేల కోట్లు గత బడ్జెట్లో కేటాయించిన మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో 1.75 వేల కోట్లకు తగ్గించింది ఒక్క యూరియా పైన నే 15 వేల కోట్లను తగ్గించటం ఆందోళన కలిగిస్తున్నది గిట్టుబాటు ధరల గురించి చట్టం తీసుకొస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం మాట వరసకు కూడా మాట మాట్లాడకపోవడం రైతుల మీద ఉన్న కపట ప్రేమకు నిదర్శనం దేశవ్యాప్తంగా ఉన్న కౌలు రైతులు పాడు సాగుదారుల భూ నిర్వాసితుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మోడీ ప్రభుత్వ కుటిల బుద్ధికి నిదర్శన మని విమర్శించారు.