కొండగట్టు ఆలయ ఫౌండర్ ట్రస్టీ సస్పెండ్

కొండగట్టు ఆలయ ఫౌండర్ ట్రస్టీ సస్పెండ్

ముద్ర, మల్యాల కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఫౌండర్ ట్రస్టీ తిరుక్కోవెలూరు మారుతిస్వామిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వo శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. గత నెల 9 న జరిగిన హుండీ లెక్కింపులొ ఎఫ్ టి చోరీకి పాల్పడ్డట్లు అనుమానం ఉందని ధర్మకర్త సురేందర్ , స్థానిక సర్పంచ్ తిరుపతి రెడ్డి ఇదే నెల 16 న కమిషనర్ కు పిర్యాదు చేసింది తెలిసిందే... వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపిన దేవాదాయ శాఖ పూర్తి స్థాయిలో సీసీ పుటేజీలను స్వాధీనం చేసుకొని, ప్రభుత్వంకు నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫౌండర్ ట్రస్టీ మారుతిస్వామిని ఆలయ పాలకవర్గం నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.