అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తాం...

అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తాం...
  • ప్రభుత్వానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలి..
  • ప్రజల కష్టసుఖాల్లో తోడుంటా..
  • ప్రజా పాలన  గ్రామ సభ ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 

ముద్ర ప్రతినిధి,రాజన్న సిరిసిల్ల :గ్రామా సభలలో దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని, పేదలకు చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్,  వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ అన్నారు. గురువారం వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 3 వ వార్డు లక్ష్మిపురం లో ప్రజా పాలన   కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు  తమ ప్రభుత్వం ప్రజల వద్దకే వెళ్లి  ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి6 గ్యారంటీ ల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు.  

డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని ప్రతి వార్డులలో ప్రజా పాలన సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామనీ  తెలిపారు.మహాలక్ష్మి , రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ఆనివార్య కారణాల వలన ఈ రోజు దరఖాస్తు ఇవ్వలేని వారు ఈ నెల 6 వ లోగా మున్సిపల్ కార్యాలయంలో అందజేయవచ్చునని తెలిపారు.95 శాతం ప్రజలకు  ప్రజా పాలన కార్యక్రమం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటి పరిష్కారం కృషి చేస్తామని అన్నారు.

ప్రజలు నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారనీ, ప్రజల కష్ట సుఖాల్లో తోడుంటామని, ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలనీ కోరారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు హామీని నెరవేర్చామని,100 రోజుల్లో అర్హులకు 6 గ్యారంటీ లు అమలు చేస్తామన్నారు.అనంతరం వేములవాడ పట్టణంలోని 4 వార్డు, కొడుముంజ గ్రామంలో ఆది శ్రీనివాస్ ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ఆర్డీఓ మధు సూదన్ రెడ్డి, తహశీల్దార్ మహేష్ , కౌన్సిలర్ లు పాల్గొన్నారు