మెదక్ జిల్లాలో భారీ వర్షం

మెదక్ జిల్లాలో భారీ వర్షం

అన్నదాతల ఆందోళన
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఆకాశం మేఘావృతమై కుండపోత వర్షం కురివడంతో మెదక్ పట్టణంలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, రామాయంపేట, హవేలి ఘనపూర్ తదితర మండలాల్లో వర్షం భారీగా కురిసింది. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు సాయంత్రం కురిసిన అకాల భారీ వర్షం మరోసారి ఆందోళన లోకి నెట్టేసింది. ఏఏ వర్షంతో తాము పెట్టిన పెట్టిబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎకరాకు 20 వేలు ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే శశి డిమాండ్
అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 20 వేలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  వర్షాలతో అన్నదాతలు తీవ్ర మనోవేదనకు గురతున్నారన్నారు. తడిచి ముద్దయిన, మొలకత్తిన ధాన్యం తక్షణం కొనుగోలు చేయాలన్నారు. మర్చి మాసంలో వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం స్పందించకపోవడం, స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం వల్ల రైతులకు ఏఏ పరిస్థితి నెలకొందన్నారు.