సిరిసిల్ల రోడ్ షో లో మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన

సిరిసిల్ల రోడ్ షో లో మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన
  • ప్రభుత్వం రాగానే జనవరిలో గల్ఫ్ పాలసీ అమలు చేస్తాం
  • గల్ఫ్ బాధిత కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ.. గల్ఫ్ పాలసీ
  • కోడళ్లకు కోపం వద్దు.. సౌభాగ్య లక్ష్మీ ఇస్తాం..
  • ఎట్లా ఉండే సిరిసిల్ల.. ఎట్లా అయింది..
  •  గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్యాకేజీ..
  •  వారానికి రెండు రోజులు సిరిసిల్లలో నే ఉంటా..
  •  అందరికీ అందుబాటులో ఉంటా.
  •  సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన..
  • మరోసారి ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి చేస్తా: మంత్రి కేటీఆర్

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం వీర్నపల్లి రోడ్ షో లో మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఎన్నో ఏండ్లుగా గల్ఫ్ పాలసీ కోసం పోరాటం చేస్తున్న గల్ఫ్ బాధితుల సమస్యపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మళ్లీ ప్రభుత్వం రాగానే జనవరిలో గల్ఫ్ పాలసీని అమలు చేస్తామని, గల్ఫ్ బాధిత కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించడమే కాకుండా గల్ఫ్ భీమాను వర్తింపజేసి రూ. 5 లక్షలు పరిహారం అందిస్తామని మంత్రి  కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండల కేంద్రాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించి.. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ రోడ్ షో లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కోడండ్లకు కోపం వద్దు, వారి కోసం మరో సారి అధికారంలోకి రాగానే  సౌభాగ్య లక్ష్మి కింద నేల కీ 3000 ఇస్తామని, కోడండ్లకు  3000 ఇస్తున్నారని, అత్తలు బాధపడద్దని, అన్ని వర్గాల ప్రజలు కొట్లాడుతూనే తెలంగాణ వచ్చిందని అన్నారు.ప్రతిసారి పోటీ చేసినప్పుడల్లా ఆశీర్వదించిర్రు, అందుకు తగ్గట్టు సిరిసిల్ల నియోజకవర్గాన్ని తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన, మీ ఎమ్మెల్యేగా నేను ఏం పని చేసినానో, ఆలోచన చేసి, మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. అప్పుడు సిరిసిల్ల ఎట్లుండే,  ఇప్పుడు సిరిసిల్ల ఏవిధంగా అయిందో ఆలోచించాలని అన్నారు.

నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అంతర్జాతీయ స్థాయిలో స్కూల్స్ నిర్మించామని, మరోసారి గెలిపిస్తే ప్రతి గ్రామంలో అంతర్జాతీయ స్థాయిలో స్కూలు లు నిర్మిస్తానని అన్నారు. ప్రతి తండాను గ్రామపంచాయతీగా చేసిన ఘనత కేసిఆర్ కి దక్కుతుందని అన్నారు. కేటీఆర్ సిరిసిల్ల కీ నిధులు అన్ని తీసుకెళ్లి అభివృద్ధి చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి, నాయకులు మాత్రం సిరిసిల్లలో ఏమి అభివృద్ధి జరగలేదని అంటున్నారు. వాళ్లు వాళ్లే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు.బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇవ్వడంలేదని, ఒక తెలంగాణ రాష్ట్రంలోని ఇస్తున్నారని,  కట్ ఆఫ్ డేటును తొలగించి అర్హులైన  బీడీ కార్మికుల అందరికీ పెన్షన్లు ఇస్తామని అన్నారు. పదేండ్ల కింద  కరంటుకు కటకట ఉండేదని రైతులు కరంటు కోసం రాత్రివేళలో పొలాల వద్దకు వెళ్లి ఎంతో మంది చనిపోయారని  అన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంటు కష్టాలు, ఎరువులు, విత్తనాల పరిస్థితి ఏ విధంగా ఉండే,తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పరిపాలనలో ఏ విధంగా ఉన్నదో ఆలోచన చేయాలని అన్నారు. గ్రామాల్లో అప్పుడు ఎవరైనా చనిపోతే సెస్ ఆఫీస్ కు ఫోన్ చేసి కరెంటు వేయించుకొని,స్థానాలు చేసే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అని అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఎరువుల కోసం లైన్ లో నిలబడి కోసం మునిగే ఎల్లయ్య రైతు చనిపోయాడని గుర్తు చేశారు. కెసిఆర్ వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహంతోనే వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ అయిందని అన్నారు. అధికారంలోకి రాగానే 2014లో మోడీ ప్రతి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని చెప్పి వెయ్యలేదని, గ్యాస్ సిలిండర్ ధర మాత్రం పెంచాడని, కెసిఆర్ ను గెలిపిస్తే గ్యాస్ సిలిండర్ 400 కీ అందజేస్తామని  అన్నారు.నిండు ఎండాకాలంలో ఎవరైనా మత్తడి దుకుతుందన ఎవరైనా ఊహించారా, ఈ ప్రాంత ప్రజల చిరుకాల  వాంఛ ఎగువ మానేరు నిండాలని, కాలేశ్వరం జలాలను కూడేలి వాగు ద్వారా ఎగువ మానేరు నింపిన  ఘనత కెసిఆర్ కు తగ్గుతుందని అన్నారు.

బాధ్యతలు పెరగడం వల్ల రాష్ట్రమంతా ప్రచారం చేస్తున్న,ప్రతి ఒక్కరినీ కలువాలని ఉంది,ప్రతి గ్రామానికీ రావాలని ఉన్నది. కానీ, రాలే కపోతున్నా, అభివృద్ధిని చూసి ఓటు వేయండి.కాంగ్రెస్ నాయకులు 24గంటల కరెంట్ వస్తలేదని అంటున్నారు, వారికీ నేనే బస్సు పెడుత, గంభీరావుపేట పేటకు  వచ్చి కాంగ్రెసోళ్లంతా కరెంటు తీగలు పట్టుకోనీ,  చూస్తే కరెంటు ఉందో లేదో తెలిసిపో తుందనీ అన్నారు.రైతులు సుఖసంతోషా లతో ఉండాలని సీఎం కేసీఆర్ రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ తదితర పథకాలు తీసుకొచ్చారన్నారు.మరోసారి  బీఆర్ఎస్  అధికారంలోకి రాగానే రైతుబంధు సాయం ఏటా రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతామని అన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్నోళ్లందరికీ సన్న బియ్యం ఇస్తామని భూమిలేనోళ్లకు కూడా రైతుబీమా తరహాలో కేసీఆర్ బీమా అమలు చేస్తామని అన్నారు. వారానికి రెండు రోజులు సిరిసిల్లలోనే ఉంటా,  అందరికీ అందుబాటులో ఉంటా మరోసారి ఆశీర్వదించండి, ఎవరైనా ఎన్ని మాటలు చెప్పినా  నమ్మి మోసపోవద్దని,  కారు గుర్తుపై ఓటు వేసి మరోసారి గెలిపించాలని కోరారు.