పేరుకే మంత్రి కేటీఆర్ దత్తత గ్రామం..

పేరుకే మంత్రి కేటీఆర్ దత్తత గ్రామం..
  • అభివృద్ధికి ఆమడ దూరంలో దేశాయిపేట...
  • బిజెపిలో పలువురు చేరిక..

ముద్ర, గంభీరావుపేట: మంత్రి కేటీఆర్ దత్తత గ్రామమైన దేశాయిపేట లో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని  బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డ బోయిన  గోపి అన్నారు. గంభీరావుపేట మండలం దేశాయిపేట గ్రామంలో తోక స్వామి ఆధ్వర్యంలో పలువురు యువకులు బిజెపి పార్టీలో చేరారు.  వారికి రెడ్డబోయిన గోపి పార్టీ కండువా  కప్పి పార్టీలోకి ఆహ్వానిచ్చారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ దేశాయిపేట గ్రామాన్ని పేరుకు మాత్రమే దత్తకు తీసుకున్నాడు, తప్ప గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని అన్నారు.  గ్రామంలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్  ఇండ్లు,దళిత బంధు, బీసీ బందు, మరియు గృహలక్ష్మి రాలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ద్వారా  నే సీసీ రోడ్లు,డ్రైనేజీలు డంపింగ్ యార్డ్,స్మశాన వాటిక నిర్మించారని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని అభివృద్ధి సాధ్యమని  అన్నారు.ఈ   మండల అధ్యక్షుడు గంట అశోక్, జిల్లా అధికార ప్రతినిధులు దేవసాని కృష్ణ,ప్రసాద్ రెడ్డి సీనియర్ నాయకులు పత్తి స్వామి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పెద్దూరు పర్శరాముగౌడ్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి  ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి అరవింద్ గౌడ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు రమేష్, యువ మోర్చా అధ్యక్షుడు విగ్నేష్,దళిత మోర్చా అధ్యక్షుడు రాజు,శక్తి కేంద్రం ఇంచార్జ్ మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.