బార్డర్ చెక్పోస్ట్  ఏర్పాటు చేసుకోవాలి

బార్డర్ చెక్పోస్ట్  ఏర్పాటు చేసుకోవాలి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : గద్వాల:ఇతర రాష్ట్రాల బార్డర్ చెక్పోస్ట్  ఏర్పాటు చేసుకోవాలి  ఇతర రాష్ట్రాల నుండి వరి ధాన్యం, మద్యం,  రాకుండా తీసుకోవలసిన చర్యల గురించి  డిజిపి అంజనీ కుమార్, ఐపిఎస్, రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్  సర్పరాజ్ అహ్మద్,  రాష్ట్ర సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కమిషనర్ అనిల్ కుమార్, కలసి జిల్లాల ఎస్పీలు, మరియు పోలీస్ కమిషనర్లు, ఎక్సైజ్ డిపార్టుమెంట్ అధికారులు, సివిల్ సప్లై అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్, మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం లిక్కర్ రాకుండా బార్డర్ చెక్పోస్టులు  ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్, సివిల్ సప్లై అగ్రికల్చర్ డిపార్ట్మెంట్  అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రాల బార్డర్ చెక్ పోస్ట్ ల వద్ద  24X7 నిఘా ఉంచాలని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండి, రాష్ట్రాల బార్డర్ చెక్పోస్ట్ నుండి  మద్యం ధాన్యం రాకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రాల బార్డర్ చెక్పోస్ట్  ఉన్న జిల్లాలో ఉన్న అధికారులు చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి  అవగాహన కల్పించాలని సూచించారు. చెక్పోస్టులు వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా  సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ బార్డర్ చెక్పోస్టుల వద్ద ఎక్సైజ్ అధికారులు సిబ్బంది  విధులలో అప్రమత్తంగా ఉండాలని, ఇతర రాష్ట్రాల నుంచి  మద్యం రాకుండా  విధులు నిర్వహించాలని సూచించారు. వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో సిబ్బందితో కలిసి సమన్వయంతో విధులునిర్వహించాలని సూచించారు.
రాష్ట్ర సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ సివిల్ సప్లై అధికారులు సిబ్బంది  రాష్ట్రాల బోర్డర్ చెక్పోస్ట్ ల వద్ద విధులు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర రాష్ట్రాల ధాన్యం  తెలంగాణకు రాకుండా కట్టు దిట్టం చేయాలని సూచించారు

జిల్లాల ఎస్పీలతో పోలీస్ కమిషనర్లతో  రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ ఐపీఎస్. (CEIR) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్  గురించి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్, మాట్లాడుతూ

సీఈఐఆర్ గురించి సామాన్య ప్రజలలో గ్రామాలలో పట్టణాలలో అవగాహన కల్పించాలని సూచించారు. సెల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి  సిఇఐఆర్ గురించి  తెలిసేలా పోలీస్ స్టేషన్ పరిధిలో సర్కిల్ పరిధిలో డివిజన్ పరిధిలో బ్లూ కోల్డ్స్ పెట్రో కార్ సిబ్బంది ప్రతిరోజు  అవగాహన కల్పించాలని తెలిపారు. సెల్ ఫోన్ పోయిందని ఎవరైనా పోలీస్ స్టేషన్కు వస్తే  సంబంధిత రిసెప్షనిస్ట్  సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిల్ రిజిస్టర్  యాప్ లో  పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. సెల్ ఫోన్/ చరవాణి ఎక్కడైనా పడిపోయిన ఎవరైనా దొంగలించుకుని పోయిన  వెంటనే CEIR  లో రిజిస్ట్రేషన్ చేయండి దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొత్తగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ  CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) అనే అప్లికేషన్  ద్వారా చరవాణి ఎక్కడైనా పోగొట్టుకున్న లేదా చోరికి గురైనా అట్టి చరవాణి లను వెతికి పట్టుకోవడానికి ఎంతో చేయూతనిస్తుందని అన్నారు.  కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖా ఆద్వర్యంలో  CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రవేశపెట్టింది.ఇందుకోసం www.ceir.gov.in  వెబ్ సైట్ లో లాగిన్ కావాలి. అందులో రెక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి పోయిన చరవాణి లోని నంబర్లు, ఐఏంఇఐ నంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడి, ఓటిపి (ఓటీపీ) కోసం మరో చరవాణి నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడి నెంబర్ వస్తుంది సంబంధిత ఐడి ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొబైల్ ఏ కంపెనీ అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఫోన్ పని చేయకుండా చేస్తుంది. చరవాణి దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి ఆన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. ఐడి నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. చరవాణి పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలని CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్  సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ కె. సృజన, డి.ఎస్పీ ఎన్. సి హెచ్ రంగస్వామి, డీ సీ యస్ ఒ రేవతి, సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ ప్రసాదరావు, ఎన్ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిడెంట్ శ్రీనివాస్ (మహబూబ్ నగర్), గద్వాల్ ఎక్సైజ్ సి ఐ లు గోపాల్, ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సి. ఐ బానోతు పటేల్, ఐటీ సెల్ సిబ్బంది   పాల్గొన్నారు.