ఇంటింటికి ప్రచారం కరపత్రాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

ఇంటింటికి ప్రచారం కరపత్రాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

ముద్ర, బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ,కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏనుగుల ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ: కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసమే పాటుపడుతుందని,అవకాసవాదులు వస్తుంటారు, పోతుంటారని వారిని కాకుండా ఒక సారి విద్యావంతుడికి అవకాశం ఇవ్వాలన్నారు.మరియు కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యమయ్యే పథకాలనే ప్రవేశపెడుతుందని,ప్రజలను మభ్యపెట్టే హామీలు ఇవ్వదని అన్నారు.చేతి గుర్తుకు ఓటు వేసి చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యంను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు సాగరం కనకయ్య,మండల నాయకుడు కళ్లెపెళ్లి సతీష్,జూలపెల్లి అంజన్ రావ్,మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు,గ్రామ ప్రజలు,మహిళలు పాల్గొన్నారు.