ప్రభుత్వ విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు

ప్రభుత్వ విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు

ముద్ర నవంబర్ 8 ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు.ముస్తాబాద్ మండలం కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దంత వైద్య క్యాంపు ఏర్పాటుచేసి దంత వైద్యులు దోర్నాల శ్యాంసుందర్ రెడ్డి ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి దంత సమస్యల గురించి అవగాహన కల్పించి ఏ విధంగా దంతాలను బ్రష్ చేసుకోవాలి అనే విషయంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ నాయిని భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ రావుల మల్లారెడ్డి, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.