అరకొర వసతుల మధ్య గ్రూప్ 4 పరీక్షలు.

అరకొర వసతుల మధ్య గ్రూప్ 4 పరీక్షలు.
  • పార్కింగ్ కు స్థలం లేక రహదారి పక్కనే నిలిపిన వాహనాలు
  • పగడ్బoదిగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు

ఖానాపూర్, ముద్ర 1 :  ఖానాపూర్ పట్టణం లో టీఎస్ పిఎస్సి గ్రూప్ 4 పరీక్షలు శనివారం అరకొర వసతులు మధ్య సాగాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పట్టణం లో మొత్తం 6 సెంటర్లను ఏర్పాటు చేశారు. 1632 మంది హాజరు కావలసి ఉండగా అందులో 1344 మంది హాజరు అయ్యారు  288 మంది గైరాజర్ అయినట్లు అధికారులు తెలిపారు.

సరైన సౌకర్యాలు కరువు..

పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేక పోయారు. అభ్యర్థుల వెంట వచ్చిన తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులు సెంటర్లకు కొద్ది దూరంలో చెట్ల నీడన, మరో చోటు నిలబడి ఇబ్బందులు పడ్డారు. మహిళలు చిన్న పిల్లలను ఎత్తుకొని ఆడిస్తూ అవస్థలు పడ్డారు. ఏ సెంటర్ వద్ద కూడా కనీసం నీడ కోసం టెంట్, మంచి నీటి వసతి కల్పించలేకపోయారు.

పగడ్బoది గా తనిఖీలు.

గ్రూప్ 4 పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ లు, సిబ్బంది పగడ్బoది 
గా తనిఖీ చేశారు. ఒక సెంటర్ వద్ద మహిళా అభ్యర్థిని చెవులకున్న నగలు తీసివేయించే ప్రయత్నం చేయగా అభ్యర్థులు,  అడ్డుకున్నారు. తరువాత లోనికి అనుమతించారు.

రోడ్డు పక్కనే పార్కింగ్.

గ్రూప్ 4 పరీక్ష కేంద్రలా వద్దకు వాహనాలపై వచ్చిన అభ్యర్థులకు సరైన పార్కింగ్ లేక అవస్థలు పడ్డారు. రోడ్డు పక్కన, ఎక్కడెక్కడో తమ వాహనాలు పార్కింగ్ చేసుకున్నారు. సెంటర్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేస్తే బాగుండేదని పలువురు చెప్పారు.