గొంగిడి నిలయంలో చండీయాగం నిర్వహించిన గొంగిడి దంపతులు......

గొంగిడి నిలయంలో చండీయాగం నిర్వహించిన గొంగిడి దంపతులు......

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నిలయం అయిన గొంగిడి నిలయంలో సోమవారం నాడు ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత. ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ మరియు రాష్ట్ర అపెక్స్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులు చండీయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోసాకనల మధ్య ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొంగిడి దంపతులు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేలా చూడాలని భగవంతుని ప్రార్థించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మరియు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కర్రే వెంకటయ్య. మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా మేనేజర్ గౌడ్. వైస్ చైర్మన్ కాటం రాజు. జడ్పిటిసి సభ్యురాలు తోటకూర అనురాధ బీరయ్య తో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.