తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష

తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష

ముద్ర న్యూస్ రేగొండ: తల్లి పాలె బిడ్డకు శ్రీరామ రక్ష అని రేగొండ సెక్టార్‌ అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ సంధ్య, అన్నారు. రేగొండ మండలంలోని  కోటంచ గ్రామంలో  మొదటి అంగన్ వాడి సెక్టార్‌లో  గ్రామా అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ తీశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. శిశువు పుట్టిన మొదటి గంట లోపు ముర్రు పాలను తాగించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని . అనంతరం సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలను నిర్వహించాలని సూపర్‌వైజర్‌ సంధ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పబ్బా శ్రీనివాస్,అంగన్ వాడి టీచర్స్ లలిత,కల్పన,ఆశ వర్కర్స్,గర్భిణీలు, గ్రామస్తులు పాల్గొన్నారు..