పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ మేళా

పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ మేళా

ముద్ర ,తంగళ్ళపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలో సిరిసిల్ల పోస్ట్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ మేళా నిర్వహించారు. హెల్త్ ప్లస్, ఎక్సరెస్ హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ బీమా పాలసీ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని గ్రామంలోని 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు వయస్సు గల వారు ఇన్సూరెన్స్ 399 రూపాయలతో 10 లక్షల బీమా సదుపాయం వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణప శివ జ్యోతి, ఉప సర్పంచ్ నాగరాజు, బుస్స లింగం,పోస్ట్ ఆఫీస్ సిబ్బంది బిపిఎం ప్రసన్న, అనుపమ ,మౌనిక,గ్రామస్తులు పాల్గొన్నారు.