ఎర్రబెల్లి హెచ్చరికలకు భయపడేది లేదు

ఎర్రబెల్లి హెచ్చరికలకు భయపడేది లేదు
  • ఆత్మీయ సమ్మేళనం కోసమే మద్యం ధరలు తగ్గింపు 
  • జేపీఎస్ ల సమ్మెకు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు సంఘీభావం

ముద్ర ప్రతినిధి, మెదక్: వదిల్లో వీధిలో చేరకపోతే తొలగిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరికలను బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. ఆరు నెలలు మిమ్మల్ని ఇంటికి సాగనంపే రోజులు వస్తాయన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మెదక్ కలెక్టరేట్ ముందు సంఘీభావం తెలిపారు. సోమవారం జేపీఎస్ఆర్ సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా సమ్మె శిబిరంలో మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేసేంతవరకు మీ వెన్నంటి ఉంటామన్నారు. విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు  పీకేస్తామన్న మంత్రి ఎర్రబెల్లివ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మీద మీ పదవులను పీకే సమయం ఆసన్నమవుతుందని పేర్కొన్నారు. 15 వేల వేతనంతో వెట్టి చాకిరి చేస్తున్నారని, నాలుగు లక్షల రూపాయల వ్యక్తం తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఏ రోజు సచివాలయానికి వెళ్ళడని పంచాయతీ కార్యదర్శులు మరియు పనిచేసే వంద కిలోమీటర్ల వేగంతో రాష్ట్రం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. తప్పని పరిస్థితిలో కలెక్టర్ లాంటి పదవులు ఉద్యోగాలు చేసేవారు కార్యదర్శిగా పనిచేస్తున్నారన్నారు. వేసవి సెలవుల్లో చిన్న పిల్లలనుఏదో ఒక కోచింగ్ లో చేర్పించాల్సిన సమయంలో సమ్మె శిబిరంలో కూర్చోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తొలగించినా మీ తరఫున ఉచితంగా వాదిస్తానని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం రఘునందన్ రావు ఆధ్వర్యంలో  బిజెపి ఆధ్వర్యంలో వివోఏల సమ్మెకు సంఘీభావం తెలిపారు.