రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు - విద్యుత్తు స్తంభాలు తొలగించకుండా రోడ్డు విస్తరణ పనులు

రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు - విద్యుత్తు స్తంభాలు తొలగించకుండా రోడ్డు విస్తరణ పనులు

ముద్ర,రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు గత రెండు నెలలుగా కొనసాగుతున్నాయి.మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి సుమారు 1.4 కిలోమీటర్ల  ఫోర్ లైన్ రోడ్డు పనులు జరుగుతున్నాయి.అయితే రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకుండానే కంకర పోసి రోడ్డు వెడల్పు చేశారు.విద్యుత్ స్తంభాలు తొలగించకపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రోడ్డు సుమారు రెండు మీటర్ల ఎత్తు పెంచడంతో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతున్నాయని, దీంతో భారీ వాహనాలు వచ్చిన సమయంలో విద్యుత్ తీగలకు తాకే ప్రమాదం ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టర్ విద్యుత్తు స్తంభాలను తొలగించి రోడ్డు వెడల్పు  పనులను చేపట్టాలని వాహనదారులు, గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్డు వెడల్పు పనులను ఆర్ అండ్ బి అధికారులు పర్యవేక్షించి వాహనదారులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ స్తంభాలతో పాటు కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను తొలగించి, ఎత్తైన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు..