ఆరుపదుల అందాల సుందరి అలెజాండ్రా

An ageless beauty queen! :  ఆమెకు ఆరుపదుల వయసు... అయితేనేం అందాల పోటీలో పాల్గొని ఆమె అందాల సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఆమె, అర్జెంటీనాకు చెందిన అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్. ఆరు పదుల వయసులో ఆమె బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ మిస్ యూనివర్స్ టైటిన్ ను సొంతం చేసుకున్నారు. 60 ఏళ్ల వయసులో బ్యూనల్ ఎయిర్స్ ప్రావిన్స్ కు మిస్ యూనివర్స్ గా ఎన్నికైన తొలిమహిళగా రికార్డ్ సృష్టించారు. వయసు మీదపడుతున్నా తరగని అందం, చిక్కటి చిరునవ్వు, మంచి మాటతీరుతో అలెజాండ్రా మారిసా రొడ్రిగ్జ్ న్యాయనిర్ణేతల మనస్సులు గెల్చుకుని టైటిల్ ఎగరేసుకుపోయారు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ రాజధాని లా ప్లాటాలో అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ నివస్తున్నారు. ఆమె వృత్తిరీత్య న్యాయవాది. అలాగే పాత్రికేయురాలిగా పని చేసిన అనుభవం కూడా ఉంది.
ఆమె పోటీలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు చాలా మంది నవ్వుకున్నా, ప్రపంచ సుందరీ కీరిటాన్ని దక్కించుకుని వారికి అలెజాండ్రా సమాధానం చెప్పారు. మిస్ యూనివర్స్ అర్జెంటీనా 2024 మేలో జరగబోయే పోటీకి తాను సిద్దం అవుతున్నట్లు అలెజాండ్రా చెప్పారు. మెక్సీకోలో 2024 సెప్టెంబర్ 28న జరగబోయే వేడుకలో సైతం తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.