ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి

ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి

జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన

ముద్ర ప్రతినిధి, నల్గొండ: ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు. మంగళవారం ఆమే మునుగోడు మండల తహాశీల్దార్ కార్యాలయం, పలు పోలింగ్ బూత్ లను ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా మునుగోడు తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ధరణి వెబ్ సైట్లో దరఖాస్తులను, ఫైళ్ల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి తహసిల్దార్ కు, సిబ్బందికి తగు సూచనలు చేశారు.

అనంతరం మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి అక్కడే ఉన్న బిఎల్ఓ లతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాలో  సవరణలో భాగంగా చనిపోయిన వారి పేర్ల తొలగింపు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, అలాగే చిరునామా మార్పు తదితర సవరణలన్నింటిని సరిగా చేసింది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఏలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా ఓటర్ జాబితా శుద్దీకరణ చేయాలని తెలిపారు. మార్గమధ్యంలో గుండ్లూరు గూడెం పోలింగ్ బూతులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డిఓ డి. సుబ్రహ్మణ్యం, మునుగోడు తహసిల్దార్ నరేందర్, డిప్యూటీ తహాశీల్దార్ నరేష్ తదితరులు ఉన్నారు.