కాంగ్రెస్ గెలిస్తే ఊరికి లాభం

కాంగ్రెస్ గెలిస్తే ఊరికి లాభం
  • కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక
  • కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్  కేకే మహేందర్ రెడ్డి

ముద్ర, ఎల్లారెడ్డిపేట :కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఊరికి లాభం అని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్రెడ్డి అన్నారు.ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో  పసుల కృష్ణ ఆధ్వర్యంలో రజక సంఘం సభ్యులు, మహిళలు, గ్రామ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గ్రామంలో ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ అనుచరులు నలుగురికి మాత్రమే లాభం జరుగుతుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో అందించిన పథకాలనే అవసరాలకు అనుగుణంగా పెంచి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డుతో ప్రజల్లోకి వెళ్లడం జరిగిందన్నారు.

ప్రజలలో అనూహ్యమైన స్పందన చూస్తుంటే సిరిసిల్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, గృహలక్ష్మి పథకం,500 లకే సిలిండర్ పట్ల మహిళలు సంతోషపడుతున్నారని అన్నారు. రైతులకు సాలుకు 16 వేల  వడ్లు, క్వింటాలుకు 2700 చెల్లించటానికి కాంగ్రెస్ పార్టీ శపధం చేయడం జరిగిందన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బింగి మల్లేశం ఆధ్వర్యంలో 20 మంది కురుమ సోదరులు పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దుమాల రజక సంఘం అధ్యక్షులు రాజు, బోనాల రవి,నాయకులు మొగుళ్ల మధు,అనవేని రవి,సతీష్, సత్తయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, గంట బుచ్చగౌడ్,అంజాగౌడ్, చెన్నిబాబు,  రాజు నాయక్,సూడిద రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.